వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్:
ప్రజాహితయాత్రలో రవాణా, బీసీ సంక్షేమమంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజురాబాద్ మండలము, పట్టణ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, సొల్లు సునిత, మల్లీశ్వరి, కడారి తిరుమల, లక్ష్మి, రాధ తదితరులున్నారు.