• ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి
  •  జమ్మికుంట పట్టణంలో జయంతి వేడుకలు
  • కేక్ కట్ చేసి..ఫ్రూట్స్ పంపిణీ చేసిన నాయకులు 

వేద న్యూస్, జమ్మికుంట:
ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ నేత దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం కరీంనగర్ జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా పట్టణంలో వేడుకలు నిర్వహించారు. జమ్మికుంట మున్సిపాలిటీ 12 వ వార్డ్ కౌన్సిలర్ మొలుగు ప్రణీత ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు.

తొలుత కేక్ కట్ చేసి..అనంతరం పలువురికి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ స్పీకర్ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషకరం అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం సముచితమని చెప్పారు.

శ్రీపాదరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మెలుగు దిలీప్, ఉడత రమేష్, అడిగోపుల సత్యం, నల్ల పరిదేశ్, నాగపూరి శ్రీనివాస్, గాదె నరేందర్, కొండా రాజు, కూన మల్లేష్, బూడిద విజయ, చుంచు రామ, కొక్కుల సరోజన, గుండేటి సంపత్, దాసరి రాజు, బూడిద శంకర్ చొక్కారావు మని, బత్తుల వంశీ, బోయిని సురేష్, ఇప్పలపల్లి వేణు, జింధం సాయి, జక్కె ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.