వేద న్యూస్, మరిపెడ:
రానున్న లోక్ సభ ఎన్నికలకు మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బీ ఆర్ఎస్అ భ్యర్థిగా మాలోతు కవితను గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కవితకు గులాబీ పార్టీ నాయకులు, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు శుభాకాంక్షలు చెప్పారు.
మహబూ బా బాద్ లోక్ సభ స్థానంలో మరోసారి గెలిచేది గులాబీ జెండా నేనని ధీమా వ్యక్తం చేశారు. కవితకు నవీన్ రావ్ పుష్పగుచ్చం అందించి.. శుభాకాంక్షలు తెలిపి.. శాలువాతో ఘనంగా సత్కరించారు.