– ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి
వేద న్యూస్, వరంగల్ టౌన్:
భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప నాయకులు ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి అన్నారు. ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో సోమవారం భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119 జయంతి ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రాంగణంలో ఎత్తైన కాంస్య విగ్రహానికి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత దేశం కష్ట కాలంలో ఉన్నపుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పాకిస్తాన్-భారత్ యుద్ధం సమయంలో.. అమెరికా ఆహార కొరతను సృష్టించి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని అంతర్జాతీయ కుట్రను గ్రహించి తలవంచకుండా శాస్త్రి దేశ ప్రజలకు రేడియో ప్రసంగంలో సందేశం ఇచ్చి దేశాన్ని రక్షించాడని గుర్తుచేశారు. ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదం ఇచ్చారని, జవాన్లు, రైతులు ఇంకా బ్రతుకుంది అంటే అది శాస్త్రి ఘనతని వివరించారు.
నేటి యువత శాస్త్రి రాజకీయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని, ఒక్కపూట ఆహారం మానేస్తే భారతదేశ రైతులను, సైన్యాన్ని ఆదుకోవచ్చని రేడియో ప్రసంగం ద్వారా ఇచ్చిన శాస్త్రి పిలుపును కొట్లాదిమంది ప్రజలు పాటించడం ద్వారా ఆయన పాలనకు నిదర్శనమని వైస్ ప్రిన్సిపాల్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఎస్పి రమణారెడ్డి, కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, వి మధుకర్ రావు, ఎన్సిసి కాడెట్స్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మ గాంధీ జయంతి కూడా కళాశాల ప్రాంగణంలో జరుపుకున్నారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు.