•  వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ :

ధరణి ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ జిల్లా పరిధి లోని వర్దన్నపేట తహసీల్దార్ కార్యాలయం లో ధరణి ఫైళ్ళ పరిష్కరణ కోసం కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్ ను కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్థవంత నిర్వహణకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటి పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ధరణి ఫైళ్లను ఈ నెల 1 వ తేది నుండి 9వ తేదీ లోగా పరిశీలన చేసి పరిష్కరించాలని అన్నారు.

ప్రస్తుతం ధరణి పోర్టల్ లో ఉన్న 35 రకాల మాడ్యూల్స్ లో తహసిల్దార్ వివిధ స్థాయిల్లో వర్గీకరణ చేసి పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపిన కలెక్టర్ , పెండింగ్ లో ఉన్న ఫైళ్ళ పరిష్కారానికి సంబంధించిన కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించారు,.

ఈ సందర్భంగా కొనసాగుతున్న నిర్వహణ తీరుపై వివరణ కోరుతూ ఫైళ్ళ పరిష్కారానికి మండలం లో ఏర్పాటు చేసిన బృందాలు, ఇప్పటివరకు పరిష్కరించిన ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో తహశీల్దార్ విజయ్, నాయబ్ తహసీల్దార్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.