- బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి ధీమా
వేద న్యూస్, ఎల్కతుర్తి:
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు మరోసారి ఖాయమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ గెలుపే లక్ష్యంగా గురువారం ఆయన అధ్వర్యంలో మండలంలోని దండేపల్లి గ్రామంలో బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు పల్లేపాటి మధుకర్, రమణాచారి, వంగ రవి, చదిరం రాకేష్, చిర శ్రీనివాస్, కొడం రమేష్, కొలిపాక శ్రీనివాస్, కృష్ణం రాజు, రవీందర్ రెడ్డి, దివాకర్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.