•  సిరిసేడు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వొడితల
  •  వొడితల ప్రణవ్ ని సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు

వేద న్యూస్, జమ్మికుంట:

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం, రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ఆలయ అర్చకులు వొడితల ప్రణవ్ కి ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి చిత్రపటాన్ని,తీర్థ ప్రసాదాలు ఆలయ కమిటీ సభ్యులు బహూకరించారు.

కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి,ఇంగిలి రామారావు ఆలయ కమిటీ చైర్మన్ కొండ విజయ్,ఆలయ అర్చకులు భైరవభట్ల నరేందర్ శర్మ,ఆలయ కమిటీ చైర్మన్ కొండ విజయ్, ఆలయ అర్చకులు భైరవభట్ల నరేందర్ శర్మ, మురహరి నరేందర్ రెనుకుంట్ల సారయ్య, జిల్లెల దేవేందర్ రెడ్డి,వేముల సుధాకర్ రెడ్డి,
కోడం రజిత- శ్రీనివాస్, కురిమిండ్ల చిరంజీవి,మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్,మరిగిద్ద మొగిలి,పర్కాల విజయ్,వంగ రామకృష్ణ,,భోగం సాయి కృష్ణ,మురహరి చలపతి, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.