వేద న్యూస్, వరంగల్ :

పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు. చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ చేయటానికి పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించానని ఎండీ అమీర్ బాబా అన్నారు.

2022 విడుదలైన నోటిఫికేషన్లో అమీర్ బాబా సివిల్  కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం అమీర్ బాబా ట్రైనింగ్ లో ఉన్నారు. కాగా నిరుపేద కుటుంబంలో పుట్టిన అమీర్ బాబా కష్టపడి సివిల్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ కావడంతో తండ్రి సందని, కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు