వేద న్యూస్, జమ్మికుంట:

బీ ఆర్ పీ ఎస్ (బీసీ రాజకీయ పోరాట సమితి) వీణవంక మండల అధ్యక్షులు గా వడ్డేపల్లి రాజగోపాల్ నియమితులయ్యారు. వల్బాపూర్ గ్రామానికి చెందిన రాజ గోపాల్ ను నియమిస్తూ బిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్, హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

తనపై నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు, నాయకులకు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బి ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులుగా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని రాజగోపాల్ ఈ సందర్భంగా మంగళవారం పేర్కొన్నారు.