వేద న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ చౌరస్తాలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యుజెఐ) ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
TSJU రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ మెరుగు చంద్రమోహన్
రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా తోకల అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శిగా కొమ్మల వాసు కుమార్, కోశాధికారిగా పాపని నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ కు అనుబంధంగా ఇందిరాగాంధీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదే విధంగా ఇప్పటి వరకు ఉన్న 18 జిల్లా కార్యవర్గాలకు తోడు మిగిలిన 15 జిల్లాలలో మహాసభలు నిర్వహించి కమిటీలను ఎన్నుకోవాలని తీర్మానించారు.
TSJU ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్
అదే విధంగా జిల్లా మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభ నిర్వహించి పూర్తిస్థాయి కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తీర్మానించారు. వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థలకు ప్రభుత్వపరంగా ప్రకటనలు ఇవ్వవద్దని తీర్మానించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర కార్యవర్గం చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
TSJU కోశాధికారి పాపని నాగరాజు
నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర కార్యవర్గం అభినందించింది. గత దశాబ్ద కాలంగా గత ప్రభుత్వ ఎలాంటి సహకారానికి నోచుకోని తెలంగాణలోని స్థానిక పత్రికలకు ఏం ప్యానల్ మెంట్ కల్పించడంతోపాటు అడ్వర్ టైజ్ మెంట్లు విడుదల చేయాలని తీర్మానించారు.