వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామం నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జమ్మికుంట పోలీసు వారు పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టే క్రమంలో..పోలీసు వారి విధులను ఆటంకపరిచి ఇసుక ట్రాక్టర్లను విలాసాగర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తీసుకుని వెళ్లారు. ఈ విషయమై కేసు నమోదు కాగా దర్యాప్తు అనంతరం ఈ కేసులోని నిందితులు విలాసాగర్ గ్రామానికి చెందిన గరిగంటి అశోక్, చెవుల రాకేష్, రచపల్లి ప్రశాంత్, చెవుల సందీప్, మోరే హరిబాబు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ ఇన్ స్పెక్టర్ వి. రవి తెలిపారు.
పోలీస్ వారి విధులను అనుసరిస్తూ వారి సమయాన్ని తెలుసుకుంటూ..అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారి పై కేసులు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరిగే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.