– మనోహర్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట,ముప్పిరి తోట గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ వృద్ధురాలిని ఎమ్మెల్యే దాసరి ఆత్మీయంగా పలకరించారు. ‘అవ్వ బాగున్నవా?..’ అంటూ అడగగా, సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది.
వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, ప్రతిపక్షాలు ఇచ్చే గ్యారెంటీ పథకాలు ప్రజలు నమ్మొద్దని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ రేణుక, ఎంపీపీ స్రవంతి, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.