వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ డివిజన్ ఏసిపి నంది రామ్ నాయక్ అధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు కవాత్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కవాత్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కవాత్‌లో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ మల్లయ్య, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు