వేద న్యూస్, డెస్క్ :
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన రాజీనామా లేఖ రాశారు.
రాజీనామా లేఖలో పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.