వేద న్యూస్, వరంగల్ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదవ తరగతిలో మిగిలిన సీట్లకు గాను భర్తీ చేయుటకు 2024-25 విద్యా సంవత్సరంకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ అర్హులు అని వరంగల్ వెస్ట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఏ హేమలత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23 వరకు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూచించిన పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 21న ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వెబ్సైట్ TSWRIES.IN వివరాలన్నీ ఇవ్వబడినవి , కావున ఇట్టి సదవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకుని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు.