- జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ :
శానిటేషన్ నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ లోని పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తో పాటు వరంగల్ నగర పరిధిలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా సానిటేషన్ స్థితిగతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోతన ట్రాన్స్ఫర్ స్టేషను పరిశీలించిన కమిషనర్ చెత్త తరలింపు విధానాన్ని, ప్లాంటు సామర్థ్యం, పనిచేసే విధానాన్ని ముఖ్య ఆరోగ్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వరంగల్ బ్యాంక్ కాలనీ ప్రాంతం లో పర్యటించి స్థానికులను నీటి సరఫరా తీరు ను అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎంతసేపు నీరు సరఫరా అవుతుంది ? నీటి సరఫరా తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారా? నీటి పన్నులు చెల్లించారా? అని క్షేత్ర స్థాయి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దేశాయి పేట గొల్ల వాడ లో పర్యటించి నీటి సరఫరా విధానాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఎల్ బి నగర్ పద్మనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా తీరు ను స్థానికులను అడిగి తెలుసుకొని నీటి వృధా ను అరికట్టాలని, అవసరాల మేరకు నీటిని వినియోగించుకోవాలని ఆన్ ఆఫ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, లైన్ మెన్ లు ఎప్పటికపుడు లీకేజీలను అరికట్టెలా చూడాలని ఈ సందర్భం గా కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సి ఎం హెచ్ ఓ డా.రాజేష్ , ఈ ఈ శ్రీనివాస్ , సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, డిఈ లు సారంగం, రంగారావు, కృష్ణమూర్తి, రవీందర్, ఏఈలు సౌజన్య, సతీష్ ,సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ ,రాజ్, ధరమ్ సింగ్, ఎల్లా స్వామి, తదితరులు ఉన్నారు.