వేద న్యూస్, వరంగల్ : 

 

అక్రమ లేఔట్ వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని బల్దియా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ వెంకన్న అన్నారు. శుక్రవారంనగర పరిధి లోని 31 డివిజన్ శాయంపేట్ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 350, 351 లలో అనుమతులు పొందకుండా అక్రమంగా చేసిన లే ఔట్ ను పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖాళిల్ ఆద్వర్యం లో డిఆర్.ఎఫ్ సిబ్బంది, జె.సి.బి. డోజర్ సహాయం తో వెంచర్లలో ఏర్పాటు చేసిన మట్టి రోడ్లు, హద్దురాళ్లను తొలగించారు. వారికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ నగర పరిధి లో వెంచర్లు చేయాలనుకుంటే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం టి.ఎస్. బి-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందిన తరువాత మాత్రమే నిబంధనకు లోబడి వెంచర్లు చేయడం, హద్దు రాళ్లు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, నిబంధనలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారు నిబంధనల ప్రకారం లే ఔట్ల కు అనుమతులు ఉన్న సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని, అక్రమ లే ఔట్ లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడి, ఆర్ధికం గా నష్టపోవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.