వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట అయ్యప్పదేవాలయం మహాకుంభాభిషేకంలో భాగంగా శుక్రవారం ‘స్వామి వారి రథోత్సవం’ జమ్మికుంట పుర వీధుల గుండా రంగ వైభవంగా జరిగింది. స్థానిక బొమ్మల గుడి శివాలయం వద్ద ప్రత్యేక రథంపైన స్వామి వారిని అధిష్టించారు.
మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో బోనాలు, చిన్నారుల కోలాటాలు, నృత్యాలతో వీధుల గుండా శోభాయాత్ర వైభవోపేతంగా నిర్వహించారు.
అయ్యప్పస్వామి వారికి భక్తులు అడుగడుగున భక్తులు మంగళహారుతులిచ్చి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సిరిమల్ల జయంధర్, ధర్మకర్తలు మనోహర్ స్వామి, దామోదర్, వీర్రాజు, రాజేంద్రప్రసాద్, ప్రతాప్ రెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.