– బీజేపీ నేత డాక్టర్ వన్నాల వెంకట రమణ

వేద న్యూస్, ఓరుగల్లు:
వరంగల్ తూర్పు బీజేపీ టికెట్ బీసీ అభ్యర్థికే కేటాయించాలని బీజేపీ నాయకులు డాక్టర్ వన్నాల వెంకట రమణ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలే నాయకత్వం వహించాలని బీసీలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ అధికారం ఇచ్చే దిశగా ప్రధాన రాజకీయ  పార్టీలన్నీ బీసీలకు టికెట్ కేటాయించాలన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ టికెట్ బీసీకే ఇవ్వాలని చెప్పారు. నియోజకవర్గంలో బీసీ జనాభా అధికంగా ఉంటుందని వివరించారు. బీసీ జాబితాలో పద్మశాలీలు 70 వేలకు పైగా ఉంటారని, అదే విధంగా కాపులు, కుమ్మరి, కమ్మరి, గౌడ్స్, పెరిక అందరూ అన్ని కులాలు కలిపి 1.50 లక్షల మంది ఉంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థికే టికెట్ కేటాయించాలని బీసీలు అందరూ కోరుతున్నారని డాక్టర్ వన్నాల వెంకటరమణ పేర్కొన్నారు.