వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకునీ వొడి బియ్యలు నైవేద్యాలు సమర్పించారు. పుట్టు వెంట్రుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. పూజ అనంతరం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు దేవర వినోద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా భక్తులందరికీ వినోద్, తిరుపతి గౌడ్ భోజనం వడ్డించారు.