- కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్
వేద న్యూస్, జమ్మికుంట:
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ వొడితెల అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మారుతీ నగర్ గల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా పడిపూజ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని ఈ మార్గము గుండా చాలాసార్లు ప్రయాణించానని, అయ్యప్ప స్వామి పుట్టినరోజు నాడు ఆ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన తోనే అనుకున్న లక్ష్యాలు కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మనిషి జీవితంలో తప్పకుండా భగవంతుని నామస్మరణ చేస్తారని పేర్కొన్నారు.
అయ్యప్ప దీక్ష కఠినమైన నిర్ణయాలతో కూడుకొని ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను జరిగయని, మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన అయ్యప్ప కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి దీప దూపా నైవేద్యాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. తాను ఏ స్థాయిలో ఉన్న జమ్మికుంట అయ్యప్పను మరవబోనని చెప్పారు.