వేద న్యూస్,వరంగల్ : 

ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏ ఆర్ ఓ/బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హల్ లో 106-వరంగల్ (తూర్పు) నియోజకవర్గం పరిధి లోగల నియోజకవర్గస్థాయి నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏ ఆర్ ఓ హాజరై సమర్థ వంత నిర్వహణకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ఓ మాట్లాడుతూ రాబోవు లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, చేపట్టాల్సిన చర్యలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు (ఎం సి సి) అమలు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి లకు అందే ఫిర్యాదులపై తీసుకోవాల్సిన చర్యలు , నియోజకవర్గంలో ఉన్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ల గుర్తింపు, నియోజకవర్గానికి కేటాయించబడి ఉన్న పోలింగ్ అధికారులు వారికి నిర్వహించే శిక్షణ తరగతులు , సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి, 85 సంవత్సరాల పైబడ్డ వృద్ధులు, పిడబ్ల్యూడి ఓటర్లు ఫారం-12 (డి) పంపిణీ నమోదు గురించి తగు ఆదేశాలు జారీ చేశారు. తూర్పు నియోజక వర్గ పరిధిలో 3909 మంది పోస్టల్ బ్యాలేట్ లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 1762 పంపిణీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఎన్నికల సామాగ్రి అందజేత కు సంబంధించి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి సి-విజిల్ ఆప్ సువిధ లాగిన్ లకు సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని, ప్రొసీడింగ్ లను సమగ్ర సమాచారంతో డ్రాఫ్టింగ్ చేయాలని, ఎం సి సి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, దివ్యాంగులకు సంబంధించి ఏ ఎం ఎఫ్ ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాలలో ర్యాంపుల ఏర్పాట్ల ను పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు.నియోజక వర్గం లో గల 230 పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు త్రిచక్రవాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, సెక్రెటరీ విజయ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ కృష్ణ రెడ్డి ,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరాం నాయక్, తహసీల్దార్లు ఇక్బాల్ , నాగేశ్వరరావు, టి పి ఆర్ ఓ కోలా రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.