వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి :

జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో గురువారం జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. 39 ఓట్లతో న్యాయవాది వేషాల అనిల్ ఈసీ మెంబర్ గా విజయం సాదించారు. బార్‌ అసోసియేషన్‌లో మొత్తం 70 మంది సభ్యులుండగా 69 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే దీంతో సీనియర్‌,మహిళా న్యాయవాదులు ఎన్నికల్లో విజయం సాదించిన వేషాల అనిల్ కు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వేషాల అనిల్ మాట్లాడుతూ బార్‌ అసోసియేషన్‌ ఈసీ మెంబర్ గా ఎన్నిక కావడానికి సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని అన్నారు.