వేద న్యూస్, ఆసిఫాబాద్:
ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాపర్తి రవీందర్ కు, ఎన్నికలలో గెలుపొంది ప్రధాన కార్యదర్శి ఎన్నికైన రాజీవ్ రెడ్డి కి బీజేపీ ఆసిఫాబాద్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖండ్రె విశాల్ , జిల్లా సీనియర్ నాయకులు సప్త శ్రీనివాస్ , ఈదులవాడ గణేష్ , బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డల మల్లయ్య , బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి ప్రకాష్ ,పెంటయ్య, మండల నాయకులు దుడిసే వినోద్, సాయి, రత్నం రవి తదితరులు పాల్గొన్నారు.