వేద న్యూస్, వరంగల్ :

నేడు (ఏప్రిల్ 1 వ తేదీ సోమవారం) వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు, ఇట్టి విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ ఆ ప్రకటన లో పేర్కొన్నారు.