వేద న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన మంద రవీందర్ ఆకస్మిక మరణానికి చింతిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తెలిపారు. ఆదివారం హనుమకొండకు పనిమీద బయలుదేరి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద రవీందర్ హఠాత్ మరణానికి గురి కావడం తీవ్రంగా కలిచివేసిందని వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.
రవీందర్ మృతి తీరని లోటని ఆయన మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వాసు వడ్లూరి, సరిగొమ్ముల మనోహర్, తిప్పారపు రమేష్ బాబు, వడ్లూరి కిషోర్, ఇంజం సాంబయ్య, మారముళ్ల ఆనంద్ తదితరులు ప్రకటించారు.