వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్నా పక్కనపెట్టి తమ ఆనందం కోసం బైక్ పై స్టంట్లు వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఓ ఇద్దరూ యువకులు బైక్ పై ములుగు రోడ్డు పబ్లిక్ ప్లేస్ లో కోతి వేషాలు వేసుకుంటూ..స్టంట్ లు చేస్తూ..తమ ఇష్టానుసారంగా వెళుతున్న విధానాన్ని ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వరంగల్ మట్వాడ పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మట్వాడ సిఐ గోపి మాట్లాడుతూ రోడ్లపై కోతి వేషాలు వేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగేలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లిక్ ప్లేస్ లో విచ్చలవిడిగా స్టంట్ లు చేస్తే నాన్ బేయిలబుల్ కేసులు తప్పవని వెల్లడించారు.