వేద న్యూస్, మరిపెడ:

చత్రపతి శివాజీ మహారాజ్ భవిష్యత్ తరాలకు సైతం ఆదర్శ ప్రాయుడని, ఆయన జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని మరిపెడ ప్రెస్ క్లబ్ అద్యక్షులు పర్వతం చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలో శివాజీ మహారాజ్ 344వ వర్ధంతి సందర్భంగా సంఘం నాయకులు గండి విష్ణు, మారం అనంత రాములుతో కలసి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులను స్మరించు కోవలసిన అవసరం నేటి సమాజానికి,యువతకు ఉందని తెలిపారు. మరిపెడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేఖ అశోక్, బోడపట్ల సతీష్, దాసరోజు బాలకృష్ణ,వెంకన్న, నాగరాజు,సురేష్, మహెందర్, రమేష్,కారంపూడి వెంకటేశ్వర్లు, గందసిరి ఉప్పాలయ్య,పులుసు సతీష్,ప్రవీణ్,చింతా వెంకన్న,బాషిపంగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.