- జమ్మికుంటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
- క్రమశిక్షణ గల కార్యకర్తలే కాషాయ పార్టీ బలం
- ఆ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు
వేద న్యూస్, జమ్మికుంట:
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం జమ్మికుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.
1980 ఏప్రిల్ 6వ తేదీన డాక్టర్ సమప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచన విధానాలకు అనుకూలంగా వారి స్ఫూర్తితో పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అటల్ బిహారీ వాజ్ పాయ్,అతనికి అండగా లాల్ కృష్ణ అద్వాని పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1984లో జరిగిన లోకసభ ఎన్నికల్లో రెండు స్థానాలు బీజేపీ గెలిచిందని, అందులో హనుమకొండ పార్లమెంటు నియోజక వర్గం ఒకటని ఆనాడు జమ్మికుంట ప్రాంతం హనుమకొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేదని గుర్తు చేశారు.
అటల్ బిహారీ వాజ్ పేయి ఈ దేశానికి ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందించారని వారి స్ఫూర్తితో ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా ఒకపక్క పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే దేశాన్ని ముఖ్యంగా రక్షణ,అభివృధి అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాడని కొనియాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు కష్టపడి పనిచేసి బండి సంజయ్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, కోరే రవీందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.