వేద న్యూస్, మరిపెడ:

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు  రామసహయం రంగారెడ్డి మరణాంతరం మరిపెడ మున్సిపాలిటీ లోని మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌజ్ లో శనివారం  బీఆర్ఎస్  సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రంగారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ నాయకులు తీర్మానం ప్రవేశపెట్టారు. రంగారెడ్డి లేకపోవడం పార్టీకి తీరని లోటన్నారు. డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున రంగారెడ్డి  మృతికి సంతాపంగా లీడర్లు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.