• మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శ

వేద న్యూస్, మరిపెడ:

 
నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం ఉదయం 11 గంటలకు డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్షలు చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు  కార్యాలయంలో రైతు నిరసన దీక్ష  లో  మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిపాలన అల్లకల్లోలంగా ఉందని, వ్యవసాయరంగం అస్తవ్యస్థంగా మారిందని ఆరోపించారు. కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుందని విమర్శించారు. నీరులేక పంటలు ఎండిపోతుంటే అవకాశం ఉన్నప్పటికీ పంటలకు నీరు అందించలేకపోతున్నారని  తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రుణాలు చెల్లించాలని, పంటలకు నీరు అందించాలని రెడ్యా నాయక్  డిమాండ్‌ చేశారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిందని విమర్శించారు. కార్యక్రమంలో రైతులు,డోర్నకల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బిఅర్ఎస్ పార్టీ నేతలు,పాల్గొన్నారు.