• మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
వేద న్యూస్, జమ్మికుంట :
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్ లోని సర్వేనం.887లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమంగా వేసిన షెడ్ ను శనివారం తొలగించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, నిర్మాణం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రభుత్వ భూములను అక్రమంగా ఎవరు ఆక్రమించుకున్న ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఆన్ లైన్ లో టీఎస్ బిపాస్ లో అనుమతి అప్లై చేసి వారం రోజుల వ్యవధిలోనే పర్మిషన్ పొందగలరని వివరించారు.
ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే వాటిని మున్సిపల్ ఆధ్వర్యంలో కూల్చి వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ వరుణ్, టీపీస్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.