•  కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సదానందం
  • జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆశావాహుల్లో ముందు వరసలో..
  •  మొదటి నుంచి జెండా మోసిన కుటుంబం
  •  ఉద్యమకారుడికి చాన్స్ ఇవ్వాలంటున్న కార్యకర్తలు
  • చైర్మన్ గిరి కోసం ప్రయత్నాల్లో పలువురు

వేద న్యూస్, జమ్మికుంట:

రాష్ట్రసర్కార్ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీకి ముహూర్తం ఖరారు చేయనుంది. హూజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే పెద్ద వ్యవసాయ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఈసారి ఎస్సీ మహిళా కోటా ఖరారైంది. దీంతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మన్ రేసులో ఉండటంతో పాటు

పదవి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు తల మునకలవుతున్నారు. కాగా కొత్తగా పార్టీలోకి చేరిన నేతలు కూడా ఆ సీటు పై కన్నేశారు. 

మొదటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కండువా మోస్తూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా ఎదుర్కొని పార్టిని, కేడర్, కార్యకర్తలను  బలోపేతం చేసి, పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకు ప్రాధాన్యతను ఇవ్వాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్ చైర్మన్ గిరి వావిలాలకు చెందిన (మాజి ఎంపిటిసి) ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుల్లూరి స్వప్న సదానందంకు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు, మండల ప్రజలు, వారి అనుచరులు ఆశిస్తున్నారు. 

మొదటి నుంచి హస్తం పార్టీ జెండా మూసి.. తిన్నావా పదవులు పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పుల్లూరి పని చేశారు. పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేసి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి కేసులను కూడా లెక్కచేయలేదు. దళితులకు భూముల పట్టాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ తో పోరాడి జైలు పాలయ్యారు.

నాడు బీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్ తో కలిసి బాలింతలకు మధ్యాహ్న భోజనం పెట్టించాలని ఫైట్ చేసి సక్సెస్ అయ్యారు. 2018లో జడ్పిటిసి టికెట్ ను కూడా ఒక పెద్ద నాయకుడు చెప్పడంతో వొదిలేసుకుని పార్టీకి కమిటెడ్ లీడర్ తాను అని ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి సీనియర్ నాయకుడికి, కడుగట్టిన కాంగ్రెస్ వాదికి హస్తం అధిష్టానం, నాయకులు కచ్చితంగా అవకాశాన్ని కల్పించి న్యాయం చేయాలని మండలకేంద్ర ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మండల పరిధిలో కొత్తగా హస్తం గూటికి చేరిన నేతలకు సముచిత న్యాయం కల్పిస్తూనే.. పార్టీకి కష్ట కాలంలో అండగా నిలిచి.. జెండా మోసిన నేతలకు సరైన ప్రయారిటీ ఇవ్వాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.