• జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

వేద న్యూస్, జమ్మికుంట:

తెలంగాణ ప్రస్తుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

1991వ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ ఐపీఎస్ కరీంనగర్ ఎస్పీగా కూడా పని చేశారని, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని వాసు వడ్లూరి గుర్తు చేశారు.రాజీవ్ రతన్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.