• సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్, ఆయన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో
  • పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డే ప్లస్  ఉగాది సెలబ్రేషన్స్ 

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండల కేంద్రంలో2024 ఉగాది పండుగ పురస్కరించుకొని …సామాజిక కార్యకర్త, ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో, తన మిత్ర బృందం సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించారు. అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఫ్రూట్స్, బ్రెడ్స్ అందజేశారు.

కార్యక్రమంలో గోపాల్ రావు , తిరుపతి , జూపాక సందీప్, వోల్లలా శ్రీకాంత్, ,సంపంగి రాకేష్, రాజు,మహంకాళి శివ, దొడ్డె రాజు, మ్యాడగని సురేష్, పులల సురేష్, రాజు ,అనిల్ , మిడిదొడ్డి సాయిరాం, సాయి,అభి తదితరులు పాల్గొన్నారు