- మహనీయుడు జ్యోతిరావు పూలే
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఎడెల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరశురాములు, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐనాలా పరుశరాములు ముఖ్య అతిథులుగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వారు మాట్లాడుతూ మహనీయుల సేవలు మరువలేనివని, జ్యోతిరావు పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడని చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసారని, పూలే, ఆయన భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని కొనియాడారు.పూలే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడని గుర్తుచేశారు.
భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉందని తెలిపారు. విద్య విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనేనని వెల్లడించారు.
పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడని వివరించారు. కార్యక్రమంలో యూత్ కోశాధికారి ఇరుగు హరీష్ యూత్ సభ్యులు సునీల్, శివ, మల్సుర్, నాగేష్,రాకేష్, మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.