• గౌడ సంఘం యువజన, బీసీ సంఘాల యోజన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రంజిత్ గౌడ్

వేద న్యూస్, ఎల్కతుర్తి:

తెలంగాణ ఉద్యమకారుడు, హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ దళితుల, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని గౌడ సంఘం యువజన, బీసీ సంఘాల యోజన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బుర్ర రంజిత్ గౌడ్ చెప్పారు.

ఎప్పుడూ ప్రజలు వెంబడి ఉండి ప్రజల కోసం కృషి చేస్తూ ఒక ఎంపీటీసీ స్థాయి నుండి నేడు ఎంపీ అభ్యర్థి స్థాయికి చేరుకున్న సుధీర్ కుమార్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ ఎంపీగా సుధీర్ కుమార్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.