వేద న్యూస్, హన్మకొండ: 

45 వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ,వరంగల్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం హన్మకొండ జిల్లా దేవునూర్ గ్రామ యువత తో కలిసి ఇనుపరాతి గట్టు సందర్శన, అడవిలో నడకను నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు సహకరించిన
హన్మకొండ జిల్లా డీఎఫ్ వో లావణ్య కి, ఫారెస్ట్ ఆఫీసర్ బిక్షపతి కి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ధర్మసాగర్ చెరువు పరిసరాలలో, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ,దేవునూరు యువత ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల  ఏరివేత కార్యక్రమం నిర్వహించి గ్రామ పంచాయితీ వారికి అందించారు.

ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత ఆదర్శనీయం: పంచాయతీ కార్యదర్శి మహేశ్ 

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఎన్ మహేష్ మాట్లాడుతూ , ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా వరంగల్ నుండి హరిత సంస్థ సభ్యులు వచ్చి ధర్మసాగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేయడం ఆదర్శనీయమని అన్నారు. మనందరిని కాపాడే ఈ భూమాతను వివిధ రకాల కాలుష్యాల నుండి కాపాడాలని కోరారు.

 అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేష్ ని సంస్థ సభ్యులు పర్యావరణ హిత జ్ఞాపికతో సత్కరించారు. ధర్మసాగర్ ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్  బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వెంగాల మురళి  ఆధ్వర్యంలో ఎంఈవో వేంకటేశ్వర రావు అతిథి గా విధ్యార్థులకు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించి ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రైజులు ఇచ్చారు. 

స్కూల్ లో  పనస మొక్క నాటారు. ప్రధానోపాధ్యుయులకు పర్యావరణానికి సంబంధించిన జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి టి.శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులు పిట్టల రవిబాబు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు, ఎస్పీ కమలాకర్ స్వామి,శివరతన్ సింగ్ యువత తదితరులు పాల్గొన్నారు.