వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ రహదారిపై మలుపుల వద్ద సిగ్నల్ లైట్స్ రాత్రిపూట పనిచేయడం లేదు. దాంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం- హైదరాబాద్ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గర్రెపెళ్లికి అనుసంధానంగా చాలా గ్రామాలు ఉన్నవి.. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఏరియాలో సిగ్నల్ లైట్స్ లేకపోవడం సరికాదని పలువురు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. సిగ్నల్ లైట్స్ పని చేయకపోవడం వల్ల లాలపల్లి, ఎలిగేడు, సుల్తానాపూర్ వైపు వెళ్లే ప్రజలు రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించిన లైట్స్ కు మరమ్మతులు చేపట్టాలని రహదారి వెంట వెళ్లే ప్రజలు, వాహనదారులు వేడుకుంటున్నారు.