వేద న్యూస్, వరంగల్: 

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ఆధ్వర్యంలో అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న  ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్  ప్లాంట్ (ఎఫ్ ఎస్ టి పి) నీ కమీషనర్ క్షేత్రస్థాయిలో  సందర్శించి ప్లాంట్ నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ తొలిసారి ప్లాంట్ ను సందర్శించిన నేపథ్యంలో అమ్మవారిపేటలోని 10, 15 కె ఎల్ డి ప్లాంట్ లో  శుద్దీకరణ సాగుతున్న పద్ధతు లైన మండిచు, జియో బ్యాగ్ పద్ధతుల్లో కొనసాగుతున్న  మల నిర్వహణ  తీరును అధికారులు కమిషనర్ కు వివరించారు. అమ్మవారిపేటలో 150 కె ఎల్ డి సామర్థ్యంతో నిర్మితమవుతున్న  ట్రీట్మెంట్ ప్లాంట్  పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, దీర్ఘకాలం మలం సెప్టిక్ ట్యాంకుల్లో నిలువ ఉండడం వల్ల ప్రజలకు  కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రపరుచుకునే విధంగా  అవగాహన కల్పించి పెద్ద మొత్తంలో సెప్టిక్ ట్యాంకర్లు ట్రీట్మెంట్ ప్లాంట్లకు చేరే విధంగా చూస్తూ సామర్థ్యం మేరకు ట్రీట్మెంట్ జరగాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి ఎం హెచ్ ఓ డా. రాజేష్ ,ఈ ఈ సంజయ్ కుమార్,  శానిటరీ సూపర్ వైజర్ పసునూరి భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమార స్వామి ,అస్కి ప్రతినిధులు రాజ్ మోహన్, అవినాష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.