వేద న్యూస్, జమ్మికుంట:
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన జన జాతర కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి, హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు వేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పూదరి రేణుక, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి , కౌన్సిలర్ పిట్టల శ్వేత, మండల మాజీ అధ్యక్షురాళ్లు లంక దాసరి లావణ్య , కోడేం రజిత మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
=====