- యువతతో బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్ ముచ్చట
వేద న్యూస్, జమ్మికుంట :
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సోమవారం జమ్మికుంట పట్టణానికి రానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో క్యాంపెయిన్ చేయనున్నారు. యువతతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా అన్నామలై హాజరయ్యే ప్రోగ్రాంను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు గట్టు సాయిరాం ఆదివారం పిలుపునిచ్చారు.
జమ్మికుంటకు తొలిసారి రాబోతున్న యువనేతకు ఘనస్వాగతం పలకనున్నట్టు పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వాన్ని యువత కోరుకుంటున్నదని చెప్పారు.యువత రాజకీయాలో రాణించాలనే నరేంద్ర మోడీ ఆలోచన మేరకు అన్నామలై, తేజస్వి సూర్య వంటి యువకులు పాలిటిక్స్ లో సక్సెస్ అవుతున్నారని వివరించారు. అలాంటి యువకులకు మంచి అవకాశాలు ఇస్తూ యువతను ముందుకు పీఎం మోడీ ముందుకు నడిపిస్తున్నారని వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.