• కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం రేవంత్

వేద న్యూస్, ఎల్కతుర్తి:
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందర నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో కలిసి బీజేపీలో చేరిన ఎల్కతుర్తి మండలకేంద్రానికి చెందిన యువకుడు అంచనగిరి వెంకటరమణ తిరిగి సొంతగూటికి చేరారు. సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో హైదరాబాద్ లో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాయకులు, కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.