వేద న్యూస్, వరంగల్:
ఖిలా వరంగల్ మండలం రామ సురేందర్ నగర్ (జక్కులొద్ది)గుడిసె వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్, ఉపాధ్యక్షులు సెక్రటరీ గజ్జ చందు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సుమారు 160 మందికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. పాత కొత్త అని తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ గుడిసె వాసులకు పిలుపునిచ్చారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్తూరు అనిల్ ,కలకోటి శ్యాం, కొత్తూరు రాజు ,భక్కి శివ, అల్లాడి యక్కయ్య, బెజ్జల కోటేశ్వర్ ,బూడిద వెంకటేశ్వర్లు ,వెంబడి వెంకటేశ్వర్లు ,నరేష్ ,ఉపేందర్, ఎండి యాకుబ్, పాషా ,మాదాస్ దీపక్, పుట్ట అనిల్, మొగుల సునీల్, మొగల్ అనిల్ , రాజేష్, దాసరపు అనిల్, బొంత సంపత్ ,జన్ను సంపత్, చిలగాని రాజు, తూల బాబు, ప్రభాకర్ ,రబ్బాని, ఎండి గౌస్, ఉపేందర్ ,శంకర్ ,పూర్ణచందర్ ,వల్లెపు కోమాల, మరిగిద్ద లావణ్య, వేమునూరు స్వప్న, ఎండి షాహిన్ ,ఉమాదేవి ,పూసల రేవతి, రమ్య, శారద , తదితరులు పాల్గొన్నారు.