వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండలంలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు ఇంటింటా బీజేపీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ నరేంద్ర మోడీ, బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.
బండి సంజయ్ కుమార్ గెలిస్తే సామాన్యుడి గెలిచినట్టేనని చెప్పారు. కరీంనగర్ లో మరోసారి కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల రఘు, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, జమ్మికుంట మండల ప్రబారి సిరంగి సతీష్, ఓబీసీ మెర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రామిడి సురేందర్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు బి సత్తన్న తదితరులు పాల్గొన్నారు.