వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులమేరకు ఈ నెల 11 సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో తెలిపారు . ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.