– గుండె జబ్బుతో బాధపడుతున్న నిండు గర్భిణి
– సాయం చేసి ఆదుకోవాలని నిరుపేద కుటుంబం వేడుకోలు

వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన ఇంగాని రమేష్-సమతలు భార్యాభర్తలు. సమత ఎనిమిది నెలల గర్భవతి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమత‌ను ఇటీవల సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చేర్పించగా, డాక్టర్లు పరీక్షించి కార్డియాక్ మయోపతి అనే గుండె జబ్బు అని తేల్చారు. పైగా గర్భవతి అవడంతో చికిత్సకు దాదాపు ఒక రోజుకు రూ.లక్షకు పైగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికి రెండు లక్షల రూపాయలు వరకు అడ్వాన్స్ చెల్లించి ఆసపత్రిలో చేర్పించారు. నిరుపేద కుటుంబం అవడంతో భర్త రమేష్ దిక్కుతోచని స్థితిలో దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే తన ఫోన్ పే/ గూగుల్ పే నెంబర్ 83091 48270 కు ఆర్థిక సహాయం అందించి సాయం చేయగలరని వేడుకుంటున్నాడు.