వేద న్యూస్, వరంగల్:

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో వరంగల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న యడ్లపల్లి సాత్విక అనే విద్యార్థికి 491/500 మార్కులు రావడంతో వరంగల్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా సాత్వికకు తల్లిదండ్రులు, పలువురు అభినందనలు తెలిపారు. తమ కూతురు జిల్లా మొదటి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.