- అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్
వేద న్యూస్, జమ్మికుంట:
గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.
ఐజేయూ కరీంనగర్ జిల్లా కన్వీనర్ నగునూరి శేఖర్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దూలం అంజి, ఈసీ మెంబర్స్ ఎండీ నసీరుద్దీన్, రావుల రాజేశం పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా జక్కే బాలరాజుగౌడ్ (సాక్షి ), ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్ రావు(మనం), ఉపాధ్యక్షుడుగా మడిపల్లి రమేష్ (ప్రజాపక్షం), సంయుక్త కార్యదర్శిగా లకిడే అనిల్ (ప్రజా దర్బార్), కోశాధికారిగా వడ్డూరి భాస్కర్( ఆంధ్రప్రభ), ముఖ్యసలహదారుగా పైడిపల్లి భీమన్న(ఆంధ్రజ్యోతి), కార్యవర్గ సభ్యులుగా రావుల రాజేశం (మన తెలంగాణ), మూడెత్తుల శివ కుమార్ (సూర్య) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి ప్రెస్ క్లబ్ సభ్యుల అభివృద్ధికి దోహదపడతానని, కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ..ప్రెస్ క్లబ్ ను ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు.
ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జక్కే బాలరాజు
ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇంగిలే ప్రభాకర్‌రావు