వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం రాధ, కుటుంబ సభ్యులు కోట,ఏకశిలా పార్క్ కుష్ మహల్ ప్రాంతాలను సందర్శించి ఇంటికీ తిరిగి వెళ్తున్న సమయంలో దుర్గం రాధ తన హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. దీంతో స్థానిక మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే సీఐ మల్లయ్య స్పందించారు.ఆయన ఆదేశాల మేరకు ఎస్సై గోవర్ధన్ ,కానిస్టేబుల్ సాంబయ్య ఖిలా వరంగల్ ప్రాంతానికి వెళ్లి దుర్గం రాధా పోగొట్టుకున్న బ్యాగును దొరక పట్టి ఆమెకు అప్పగించారు. అందులో రూ.6 వేలు నగదు,బయోమెట్రిక్ మిషన్,విలువైన పత్రాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు సీఐ మల్లయ్యకు, ఎస్సై గోవర్ధన్, కానిస్టేబుల్ సాంబయ్యకు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.